R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కదులుతున్న బస్సు నుంచి పడిన వృద్ధ మహిళ మృతి – హృదయవిదారక ఘటన

కదులుతున్న బస్సు నుంచి పడిన వృద్ధ మహిళ మృతి – హృదయవిదారక ఘటన

కదులుతున్న బస్సు నుంచి పడిన వృద్ధ మహిళ మృతి – హృదయవిదారక ఘటన

కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఓ 74 ఏళ్ల వృద్ధ మహిళ ఆర్టీసీ బస్సు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోయి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మానవ మనసులను కలిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వివరాల్లోకి వెళ్తే, ఆగస్ట్ 11న త్రిసూర్‌లో బస్టాండ్‌ వద్ద బస్సు ఎక్కిన మహిళ, లోపల ఖాళీగా ఉన్న సీటు వైపు వెళ్లే సమయంలో ఒక్కసారిగా కదులుతున్న బస్సులో అదుపుతప్పి డోర్‌ నుంచి కిందపడిపోయింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.ఈ క్షణిక ఘటనను గమనించిన కండక్టర్‌ ఆమెను పట్టుకునే ప్రయత్నం చేసినా, అప్పటికే ఆలస్యమైంది. ఈ విషాద సంఘటనను చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi