R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అమెరికా నుంచి భారత్‌కు అపాచీ హెలికాప్టర్ల ఆగమనం
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అమెరికా నుంచి భారత్‌కు అపాచీ హెలికాప్టర్ల ఆగమనం

అత్యాధునిక అపాచీ AH-64E అటాక్ హెలికాప్టర్లు అమెరికా నుంచి భారత్ చేరుకున్నాయి. హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఇవాళ ల్యాండ్ అయ్యాయి. భారత ఆర్మీ కోసం వీటి డెలివరీ ఆలస్యం కావడంతో ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న భారత సైన్యానికి ఇది శుభవార్త. గూఢచర్యం, శత్రు దళాలపై దాడుల కోసం ఈ హెలికాప్టర్లు ఉపయోగపడతాయి. తొలుత రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో అపాచీ స్క్వాడ్రన్‌ను ఏర్పాటు చేసిన 15 నెలల తర్వాత ఇవి చేరడం విశేషం. 2015లో 22 హెలికాప్టర్లు, అనంతరం 2020లో ట్రంప్ పర్యటన సందర్భంగా మరో 6 హెలికాప్టర్ల ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. వాటిలో మొదటి విడతగా వచ్చిన 3 హెలికాప్టర్లు తాజాగా భారత్‌కు చేరాయి.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi