krtv
రచయిత
రేవంత్ పాలనలో గురుకులాల పరిస్థితి దయనీయంగా మారింది – హరీష్ రావు | kranthinews
krtv
రచయిత
రేవంత్ పాలనలో గురుకులాల పరిస్థితి దయనీయంగా మారింది – హరీష్ రావు | kranthinews

హైదరాబాద్: తెలంగాణలో గురుకుల విద్యాసంస్థలు రేవంత్ రెడ్డి పాలనలో నిర్వీర్యమవుతున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసిన ఆయన, విద్యా రంగ neglect వల్ల లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందన్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేయకపోవడంతో కోడిగుడ్లు, మాంసం, పండ్ల సరఫరా ఆగిపోయిందని, ఇకపై పూర్తిగా ఆహార సరఫరా నిలిచే పరిస్థితి ఉందన్నారు. 13 నెలలుగా అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో భవన యజమానులు తాళాలు వేస్తున్నారని అన్నారు.ఇప్పటికీ స్కూల్ యూనిఫామ్‌లు, బూట్లు, బ్యాగులు ఇవ్వకపోవడం శోచనీయమని విమర్శించారు. గత పదేళ్లలో అభివృద్ధి చెందిన గురుకులాల ప్రతిష్ట క్షీణిస్తోందని, వెంటనే బకాయిలు చెల్లించి, పిల్లల భవిష్యత్తు కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.