Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఆరు హామీలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది: కేటీఆర్

ఆరు హామీలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది: కేటీఆర్

ఆరు హామీలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది: కేటీఆర్

రాష్ట్ర ఆదాయం క్షీణించడంపై బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ స్పందించారు. కాగ్ త్రైమాసిక నివేదికలో ఆదాయం తగ్గినట్లు తెలిపారని, ఇది ఆర్థిక పరిస్థితిపై ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలు ఆర్థిక స్థితిని బలహీనంగా మార్చాయన్నారు. ఆదాయం తగ్గుతున్నప్పటికీ అప్పులు పెరుగుతున్నాయని విమర్శించారు. "బడ్జెట్‌లో రూ.2,738 కోట్లు మిగులు చూపినా, మొదటి త్రైమాసికానికి రూ.10,583 కోట్లు లోటు నమోదైంది. రూ.20,266 కోట్లు అప్పుగా తీసుకున్నా, ఒక్క కొత్త రోడ్డు కానీ ప్రాజెక్టు కానీ ప్రారంభించలేదు" అని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారో ప్రజలకు చెప్పాలంటూ సవాలు విసిరారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi