R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కేవలం సూచనలు మాత్రమే చేసింది: అద్దంకి దయాకర్
R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కేవలం సూచనలు మాత్రమే చేసింది: అద్దంకి దయాకర్

స్పీకర్ అధికారాలను సుప్రీంకోర్టు ప్రశ్నించలేదని, కేవలం సూచనలు మాత్రమే చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, సభా హక్కులను కాపాడే అధికారం స్పీకర్‌కే ఉందని సుప్రీం స్పష్టం చేసిందన్నారు. భారత రాష్ట్ర సమితి నేతలు తాము గెలిచినట్టు తప్పుగా ప్రజల్లో ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలను విలీనం చేసిన చరిత్ర కేసీఆర్‌దేనని విమర్శించారు. దళిత నేత సీఎల్పీ లీడర్‌గా ఉన్న విషయంలో తట్టుకోలేక కాంగ్రెస్ శాసనపక్షాన్ని కలిపారని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలను అణచివేయాలనే కేసీఆర్ యత్నాలను కాంగ్రెస్ అడ్డుకుందని చెప్పారు. అసెంబ్లీకి రావడం తప్పించుకుంటున్న కేసీఆర్‌పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi