L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రష్యాలో ఘోర విమాన ప్రమాదం – ఎలాంటి ప్రాణహాని తప్పదన్న అనుమానం

రష్యాలో ఘోర విమాన ప్రమాదం – ఎలాంటి ప్రాణహాని తప్పదన్న అనుమానం

రష్యాలో ఘోర విమాన ప్రమాదం – ఎలాంటి ప్రాణహాని తప్పదన్న అనుమానం

రష్యాలోని బ్లాగోవెష్‌చెన్స్క్ నుంచి టైండాకి వెళ్తున్న అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏఎన్-24 విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని 43 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. విమానం గమ్యస్థానానికి చేరుకునే లోపే రాడార్‌ నుంచి అదృశ్యమవడంతో, విమానం కూలిపోయినట్టు గుర్తించారు. టైండా పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం సంభవించినట్టు సమాచారం. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ల్యాండింగ్‌కు చేసిన రెండు ప్రయత్నాల్లో విమానం కూలిపోయినట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలిలో భారీగా మంటలు ఎగసిపడుతుండగా, ఇప్పటివరకు ఎవరూ ప్రాణాలతో బయటపడిన అవకాశమేమీ కనిపించడంలేదని ప్రాథమిక సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi