A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తిరుమల శ్రీవారికి చెన్నై భక్తుల భారీ బంగారు కానుక
A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తిరుమల శ్రీవారికి చెన్నై భక్తుల భారీ బంగారు కానుక

తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధులు విలువైన బంగారు శంఖం, చక్రాన్ని కానుకగా సమర్పించారు. దాదాపు 2.5 కేజీల బరువున్న ఈ ఆభరణాల విలువ రూ.2.4 కోట్లు. ఈ కానుకలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం దాతలను శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఇదిలా ఉండగా, టీటీడీ ఈవో జె. శ్యామలరావు శ్రీనివాస కల్యాణోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. కల్యాణోత్సవాలను మరింత శాస్త్రీయంగా, భక్తి భావంతో నిర్వహించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. విదేశాల్లో కూడా కల్యాణోత్సవాల నిర్వహణకు మౌలిక విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తిరుమల వ్యర్థాల నిర్వహణపై కూడా సమీక్ష జరిపిన ఈవో, టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi