ashok
రచయిత
ఆరోగ్యంగా ఉండాలంటే మూడు సింపుల్ రూల్స్!
ashok
రచయిత
ఆరోగ్యంగా ఉండాలంటే మూడు సింపుల్ రూల్స్!

వయసు పెరిగినా ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలంటే కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కొన్ని జీవితశైలిలో మార్పులు చేసి, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నిపుణుల సూచనల ప్రకారం, కింది మూడు ఆరోగ్య అలవాట్లు పాటిస్తే చాలు.. శారీరక, మానసిక ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. 1. సమతుల ఆహారం తీసుకోండి ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు వంటి ముఖ్యమైన పోషకాలు ఉండే ఆహారం రోజూ తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకుంటే శక్తి, ఇమ్యూనిటీ మెరుగవుతుంది. ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కువ చక్కెర లేదా ఉప్పు కలిగిన పదార్థాలు వీలైతే తగ్గించాలి. 2. రోజూ వ్యాయామం తప్పనిసరి రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, జాగింగ్, సైక్లింగ్, ఈత వంటి శారీరక చురుకుతనం అవసరం. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక, ఒత్తిడి తగ్గించడంలో, బరువు నియంత్రణలో సహాయపడుతుంది. 3. నిద్రను నిర్లక్ష్యం చేయవద్దు రోజూ 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. నిద్ర పుష్కలంగా లభించకపోతే మానసికంగా తలెత్తే సమస్యలు పెరుగుతాయి. రాత్రి పడుకునే ముందు కాఫీ, టీ తాగడం, మొబైల్ వాడకం వంటివి తగ్గించాలి. ఒకే సమయానికి నిద్రపోవడం, మేలుకోవడం వంటి నియమిత జీవనశైలి పాటించాలి. ఈ మూడు అలవాట్లు మీ రోజువారీ జీవితంలో అలవాటుగా మార్చుకుంటే, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.