Lahari
రచయిత
నోట్లో పుండ్లు తగ్గించుకోవడానికి చిట్కాలు
Lahari
రచయిత
నోట్లో పుండ్లు తగ్గించుకోవడానికి చిట్కాలు

నోట్లో పుండ్లు చాలా మందికి ఏర్పడే సాధారణ సమస్య. వేడికల ఆహారం, బలంగా బ్రష్ చేయడం, పోషకాహార లోపం, ఒత్తిడి, హార్మోన్లు లేదా కొన్ని మందులు కారణంగా ఇవి వస్తాయి. ఈ సమస్యను తగ్గించేందుకు కొన్ని సహజ చిట్కాలు ఉన్నాయి: ఉప్పు నీళ్లు – 1 టీ స్పూన్ ఉప్పును గోరు వెచ్చని నీటిలో కలిపి 30 సెకన్ల నుండి 1 నిమిషం పుక్కిలించాలి. రోజుకు 3–4 సార్లు చేయాలి. తేనె – నోట్లో పుండ్లపై నేరుగా తేనె రాయడం వలన నొప్పి తగ్గుతుంది. రోజుకు 2–3 సార్లు చేయాలి. కొబ్బరినూనె – కొద్దిగా నోట్లో పుండ్లపై రాయడం వలన వాపు తగ్గుతుంది. బేకింగ్ సోడా పేస్ట్ – కొద్దిగా బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్ట్ చేసి నోట్లో పుండ్లపై రాయాలి. తర్వాత కడిగి వేయాలి. కలబంద గుజ్జు – నోట్లో అల్సర్లపై నేరుగా రాయడం వలన నొప్పి తగ్గుతుంది. రోజుకు 3–4 సార్లు చేయాలి. సహజ చిట్కాలు పాటించినా 1 వారంలో మార్పు లేకపోతే డాక్టర్‌ని సంప్రదించడం అవసరం.

