L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ముంబైలో కుండపోత వర్షం – విమానాలు, రైళ్లు ఆలస్యం, పాఠశాలలకు సెలవు
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ముంబైలో కుండపోత వర్షం – విమానాలు, రైళ్లు ఆలస్యం, పాఠశాలలకు సెలవు

ముంబైలో మంగళవారం భారీ వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. రోడ్లు నదులను తలపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాగ్రత్త చర్యలుగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ప్రైవేట్ సంస్థలకు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వాలని సూచించారు. వర్షం ప్రభావంతో విమాన రాకపోకల్లో ఆటంకం ఏర్పడింది. ముంబై విమానాశ్రయం నుంచి బయల్దేరే సుమారు 155 విమానాలు ఆలస్యమయ్యాయి. మొత్తం మీద దాదాపు 250 విమానాలు డిలే అయ్యాయి. రైల్వే ట్రాక్‌లపై నీరు చేరడంతో సెంట్రల్ రైల్వే మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక వాతావరణ శాఖ ముంబై నగరం, శివారు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తూ మరిన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthiheavy rains