K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కేంద్రమంత్రి అమిత్ షాపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహం | congress | kranthinews
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కేంద్రమంత్రి అమిత్ షాపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహం | congress | kranthinews

హైదరాబాద్,క్రాంతిన్యూస్ :కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నక్సల్స్‌కు మద్దతిస్తున్నదన్న ఆరోపణలు అసత్యమని, బీజేపీకి నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు."ఆపరేషన్ కగార్‌లో శాంతి చర్చల కోసం ప్రయత్నించినాం. అదే తప్పా? దేశంపై దాడి చేసిన ఉగ్రవాదులపై బీజేపీ తీరును దేశం మొత్తం చూశింది. ట్రంప్ మాటకు నొచ్చుకొని మీరు వెనక్కి తగ్గినపుడు మేమేం చేశాం?" అని గౌడ్ ప్రశ్నించారు.జూలై 4న ఎల్బీ స్టేడియంలో జరగనున్న గ్రామస్థాయి కాంగ్రెస్ నేతల సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ సభకు సుమారు 25,000 మంది నేతలు హాజరవుతారని చెప్పారు. సోమవారం రోజున సభ ఏర్పాట్లను పీసీసీ నేతలు పరిశీలించారు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugupoliticskrtv kranthitelagnana