Lahari
రచయిత
సరోగసీ ముసుగులో నకిలీ బిడ్డల వాణిజ్యం
Lahari
రచయిత
సరోగసీ ముసుగులో నకిలీ బిడ్డల వాణిజ్యం

సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అధినేత్రి డాక్టర్ నమ్రత ఆధ్వర్యంలో పెద్ద అవకతవకల ముఠా నడుస్తోందని గోపాలపురం పోలీసులు రిమాండు రిపోర్టులో వెల్లడించారు. సంతానలేమితో బాధపడుతున్న దంపతులను విశాఖ బ్రాంచ్‌కు తీసుకెళ్లి సరోగసీ చేస్తామంటూ నమ్మించి, వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ.. చివరకు అస్సాం మహిళల నుంచి కొన్న పిల్లలను వారి బిడ్డలుగా అప్పగించేవారట. గాంధీ ఆసుపత్రి డాక్టర్ల సహకారంతో బాధితులకు మత్తుమందులు ఇచ్చేవారు. రాజస్థాన్ దంపతులు డీఎన్ఏ పరీక్ష చేయడంతో ఈ మోసం బయటపడింది. పిల్లల విక్రయం ద్వారా వచ్చిన డబ్బును నమ్రత సహకారులైన జయంత్, సంతోషిని, కల్యాణితో పంచుకొని, వారికి బహుమతులివ్వడం జరిగినట్టు పోలీసులు తెలిపారు. విశాఖలోని బ్రాంచ్‌కు 2023లో అనుమతులు ముగిసినప్పటికీ తిరిగి పునరుద్ధరించకుండానే అక్రమంగా కేంద్రాన్ని నడిపారని రిమాండు నివేదికలో పేర్కొన్నారు.