ritesh
రచయిత
విలన్ పాత్రల వెనుక విషాద గాథ.. పొన్నాంబళం ఆరోగ్య పరిస్థితిపై కలకలం
ritesh
రచయిత
విలన్ పాత్రల వెనుక విషాద గాథ.. పొన్నాంబళం ఆరోగ్య పరిస్థితిపై కలకలం

తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో శక్తివంతమైన ప్రతినాయక పాత్రలతో గుర్తింపు పొందిన పొన్నాంబళం ఇప్పుడు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అగ్రహీరోలందరి సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఈ నటుడు, స్టంట్‌మాస్టర్‌గా కెరీర్ ప్రారంభించి, శక్తివంతమైన ఫిజిక్‌తో విలన్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.కిడ్నీ సమస్యలు, డయాలసిస్ బాధలు ఇప్పుడు ఆయనను కాస్త కుంగవేశాయి. 2021 నుంచి డయాలసిస్ చేసుకుంటున్నట్టు చెబుతూ, నాలుగు సంవత్సరాల్లో 750 సార్లు ఇంజెక్షన్లు తీసుకున్నానని, ప్రతి రోజు శరీరంలో రంధ్రాలు పడుతున్నాయని వేదన వ్యక్తం చేశారు. “ఉప్పు తినలేను, పూర్తిగా తిండి కూడా తినలేను. ఈ బాధ నా శత్రువులకు కూడా రాకూడదు” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలను ఖచ్చితంగా నిర్వహించి, తన ప్రాణాలను అడ్డుపెట్టిన ఈ నటుడు ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులూ ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఏడాదిలో పది సినిమాల్లో నటించిన స్థాయిలో ఉన్న పొన్నాంబళం, ఇప్పుడు జీవితపు మరో విభిన్న రంగును అనుభవిస్తున్నారు.