K

krtv

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో విషాదం

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో విషాదం

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో విషాదం

రైలు ప్రయాణంలో దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ రైలులోంచి కిందపడిన ఓ వ్యక్తిని రక్షించేందుకు రైలు దాదాపు 1.5 కిలోమీటర్లు వెనక్కి వెళ్లింది. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఈ ఘటనలో గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన హరిబాబు (35) కిందపడగా, స్నేహితులు వెంటనే చైన్ లాగి రైలును ఆపించారు. రైల్వే సిబ్బంది, ప్రయాణికుల సహాయంతో హరిబాబును తిరిగి రైలులోకి ఎక్కించి మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ హరిబాబు మృతి చెందాడు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొంది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi