yakub
రచయిత
నిమిష ప్రియ కేసులో మలుపు: బ్లడ్‌మనీకి అంగీకరించని మృతుడి కుటుంబం
yakub
రచయిత
నిమిష ప్రియ కేసులో మలుపు: బ్లడ్‌మనీకి అంగీకరించని మృతుడి కుటుంబం

యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో ఉద్రిక్తత కొనసాగుతోంది. నేటి నుంచి అమలుకావాల్సిన శిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయగా, మృతుడు తలాల్ అదిబ్ మెహది కుటుంబం మాత్రం ఆమెకు శిక్ష పడాల్సిందేనని పట్టుబడుతోంది. "డబ్బుతో ప్రాణాలకు విలువ నిర్ణయించలేం" అంటూ అతని సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహది స్పష్టం చేశారు. బ్లడ్‌మనీని అంగీకరించబోమని, నేరానికి శిక్ష తప్పనిసరి అని తెలిపారు. ఇక నిమిష ప్రియ కుటుంబం బాధిత కుటుంబానికి రూ.8.6 కోట్లు క్షమాధనంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ మృతుడి కుటుంబం శిక్షపై అడ్డంగా ఉండడంతో కేసు పరిష్కారం ఇంకా ఊహాతీతంగా మారింది. భారత విదేశాంగ శాఖ యెమెన్ అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నదిగా తెలిపింది. మతగురు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ చర్చల ఫలితమే ఇప్పుడు కీలకం కానుంది.