L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఇద్దరు నిందితులు కస్టడీలో
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఇద్దరు నిందితులు కస్టడీలో

సరోగసీ మోసం కేసులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా, పోలీసులు ఏ3 నిందితురాలు కల్యాణి (విశాఖ మేనేజర్), ఏ6 ధనశ్రీ సంతోషిని (అస్సాం) ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. సికింద్రాబాద్ సివిల్ కోర్టు అనుమతితో వీరిని డీసీపీ కార్యాలయానికి తరలించారు. విచారణకు ముందు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు. ఫెర్టిలిటీ కేంద్రం ద్వారా దంపతులను మోసం చేసి, అస్సాం నుంచి స్త్రీల ద్వారా పిల్లలను తెప్పించి, తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే, నిబంధనలకు వ్యతిరేకంగా వీర్యం, అండాలను ఇతర రాష్ట్రాల్లో విక్రయించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news