R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఉపేంద్ర కుటుంబం వరలక్ష్మీ వ్రతం వేడుక
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఉపేంద్ర కుటుంబం వరలక్ష్మీ వ్రతం వేడుక

కన్నడ స్టార్ హీరో, దర్శకుడు ఉపేంద్ర కుటుంబం తాజాగా వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకుంది. ఆయన భార్య, నటి ప్రియాంక త్రివేది సోషల్ మీడియాలో పండుగ ఫోటోలను పంచుకోవడంతో అవి వైరల్‌గా మారాయి. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఉపేంద్ర–ప్రియాంక జంటను అభిమానులు చూసి ముచ్చటపడ్డారు. 2003లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. బెంగాలీ నటి అయిన ప్రియాంక, తెలుగుతో పాటు కన్నడ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. హీరోగానే కాకుండా దర్శకుడిగానూ విభిన్న కాన్సెప్ట్ సినిమాలతో పేరు తెచ్చుకున్న ఉపేంద్ర, ఇటీవలి కాలంలో ప్రధాన పాత్రల కంటే ప్రత్యేక పాత్రలతోనే ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi