ritesh
రచయిత
వందే భారత్ రైళ్లు దేశాన్ని కలుపుతున్నాయి: అమితాబ్ కాంత్
ritesh
రచయిత
వందే భారత్ రైళ్లు దేశాన్ని కలుపుతున్నాయి: అమితాబ్ కాంత్

వందే భారత్ రైలు దేశాన్ని ఒకతాటిపైకి తీసుకెళ్తోందని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు మార్గాలు భారతం యొక్క ఐక్యతను ప్రతిబింబిస్తున్నాయని జీ20 భారత్ షెర్పా అమితాబ్ కాంత్ అన్నారు. ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వందే భారత్ రైళ్ల రూట్లను చూపించే ఆసక్తికర మ్యాప్‌ను షేర్ చేశారు.ఈ మ్యాప్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. రైళ్లు ఇంకా వేగంగా పరుగెత్తాలంటూ, గంటకు కనీసం 150 కిలోమీటర్ల వేగం అవసరమని కొందరు అభిప్రాయపడ్డారు. మౌలిక వసతుల మెరుగుదలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని సూచించారు.2019లో ఢిల్లీ-వారణాసి మధ్య మొదటి వందే భారత్‌ను ప్రధాని మోదీ ప్రారంభించగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 150కి చేరింది. ఇటీవలే అమృత్‌సర్–శ్రీమాత వైష్ణోదేవి కత్రా, బెలగావి–బెంగళూరు, అజ్ని–పుణె రూట్లలో వందే భారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి.