R

ramya

రచయిత

1 నిమిషాలు చదవడానికి

‘కింగ్డమ్’ విజయం పట్ల టీమ్ సంతోషం – పార్ట్ 2పై విజయ్ దేవరకొండ స్పందన

‘కింగ్డమ్’ విజయం పట్ల టీమ్ సంతోషం – పార్ట్ 2పై విజయ్ దేవరకొండ స్పందన

‘కింగ్డమ్’ విజయం పట్ల టీమ్ సంతోషం – పార్ట్ 2పై విజయ్ దేవరకొండ స్పందన

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘కింగ్డమ్’ థియేటర్లలో విడుదలై మంచి స్పందన పొందుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర బృందం పాల్గొని ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ఓవర్సీస్, రాయలసీమ, నైజాం, ఆంధ్రా ప్రాంతాల్లో సినిమాకు ఆశించిన మేర రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, సినిమా రిలీజ్ డేట్ మారితే చిరాకొస్తుందని అన్నారు. ‘రెట్రో’ సినిమాతో పోలికలపై స్పందిస్తూ – “నిజం చెప్పాలంటే సినిమా ఇంకా చూడలేదు. చూసిన తర్వాత చెబుతా” అన్నారు. ప్రస్తుతం సూరి పాత్ర నుంచి బయటపడి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ‘కింగ్డమ్ 2’ గురించి నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, విజయ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తైన తర్వాత పార్ట్ 2 ప్రారంభిస్తామని, అందులో ఓ ప్రముఖ హీరో కూడా ఉంటారని వెల్లడించారు. హీరోయిన్ పాత్ర నిడివి తక్కువగా ఉండడంపై పార్ట్ 2లో ఆమె పాత్రకు పెద్ద స్కోప్ ఉంటుందన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో సక్సెస్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు చెప్పారు.

ట్యాగ్‌లు

CinemaKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi