ritesh
రచయిత
విజయ్ – రష్మిక మూడోసారి స్క్రీన్ షేర్ బ్రిటిష్ పాలన నేపథ్యంలో కొత్త యాక్షన్-డ్రామా
ritesh
రచయిత
విజయ్ – రష్మిక మూడోసారి స్క్రీన్ షేర్ బ్రిటిష్ పాలన నేపథ్యంలో కొత్త యాక్షన్-డ్రామా

టాలీవుడ్ స్టార్‌లు విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న మళ్లీ స్క్రీన్‌పై కలిసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో . గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో అభిమానులను అలరించిన ఈ జంట ఇప్పుడు మూడోసారి సినిమా చేయనుందని సమాచారం. యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ ఒక భారీ యాక్షన్-ఎమోషనల్ డ్రామా. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించబడింది. సినిమా కథ 1854–1878 మధ్య బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే సంఘటనలపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. విజయ్ రాయలసీమ యాసలో పల్లెటూరి యువకుడిగా కనిపించనున్నాడు. ఎమోషన్, యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని, రాహుల్ సాంకృత్యాన్ స్క్రీన్‌ప్లే హైలైట్‌గా నిలుస్తుందనుకుంటున్నారు. గత జంట సినిమాల్లోని కెమిస్ట్రీకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో, మూడోసారి కలిసిన ఈ జంటపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

