A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అనారోగ్యకర ఆహారాలపై హెచ్చరికలు: సమోసా, జిలేబీలకూ వార్నింగ్ బోర్డులు
A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అనారోగ్యకర ఆహారాలపై హెచ్చరికలు: సమోసా, జిలేబీలకూ వార్నింగ్ బోర్డులు

ఆరోగ్యంపై పెరుగుతున్న ముప్పును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కొత్త చర్య తీసుకుంది. కొవ్వులు, చక్కెరలు అధికంగా ఉండే సమోసా, జిలేబీ, పకోడీ, వడాపావ్ వంటి సాంప్రదాయక ఆహారాలపై హెచ్చరికలు తప్పనిసరి చేసింది. నాగ్‌పూర్ ఎయిమ్స్‌లో ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు ప్రారంభమై, తరువాత దేశవ్యాప్తంగా అమలు కానుంది. ఆహార పదార్థాల్లో చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్ వంటి హానికర పదార్థాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు. స్టాల్స్ పక్కన సిగరెట్ ప్యాకెట్ల తరహాలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఈ చర్య సాంప్రదాయక వంటకాలపై నిషేధం కాదని, అవగాహన పెంచే ప్రయత్నమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా సమతుల ఆహారం అవసరమనే విషయాన్ని ప్రజల్లో బలంగా నాటాలని అధికారులు భావిస్తున్నారు.
ట్యాగ్‌లు
LatestAgriTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi