R

ramya

రచయిత

1 నిమిషాలు చదవడానికి

వన్డేల్లో కోహ్లీ, రోహిత్ భవితవ్యం ఏమవుతుంది?

వన్డేల్లో కోహ్లీ, రోహిత్ భవితవ్యం ఏమవుతుంది?

వన్డేల్లో కోహ్లీ, రోహిత్ భవితవ్యం ఏమవుతుంది?

టీ20, టెస్టుల నుంచి విరమణ ప్రకటించిన కోహ్లీ, రోహిత్ వన్డేల్లో కొనసాగాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే యువ జట్టు అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో, వీరిద్దరూ వన్డేల్లో స్థానం నిలబెట్టుకోగలరా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఈ ఇద్దరూ వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో, అనంతరం దక్షిణాఫ్రికాతో వన్డేలు ఆడే అవకాశముంది. అలాగే న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌ సిరీస్‌లు కూడా ఉంటాయి. కానీ 2027 వన్డే వరల్డ్‌కప్‌ దృష్టిలో ఉంచుకుంటే, ఈ సీనియర్లకు ఇంకా అవకాశం ఇవ్వాలా? లేక యువతకు ఛాన్స్ ఇవ్వాలా? అనే అంశంపై బోర్డు ఆలోచనలో ఉంది. ‘‘ఇప్పుడే నిర్ణయం లేదు, త్వరలో వారి ఫిట్‌నెస్, ప్రణాళికలపై చర్చించనున్నాం. ప్రపంచకప్‌కు స్పష్టమైన దారిదిశ అవసరం. అప్పటికి రోహిత్ వయస్సు 40 దాటుతుంది, కోహ్లీ కూడా 40 సమీపంలో ఉంటారు,’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో, ఈ ఇద్దరిని ఒత్తిడిలోకి తేయాలన్న ఉద్దేశం లేదని, వన్డే షెడ్యూల్ ప్రారంభానికి ముందే ప్రొఫెషనల్‌గా వారితో చర్చలు జరుగుతాయని స్పష్టం చేశాయి.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi