yakub
రచయిత
భర్త హత్యకు మామతో సహాయపడ్డ భార్య... పెళ్లైన 45 రోజుల్లోనే విషాదాంతం
yakub
రచయిత
భర్త హత్యకు మామతో సహాయపడ్డ భార్య... పెళ్లైన 45 రోజుల్లోనే విషాదాంతం

బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో కలచివేసే ఘటన వెలుగు చూసింది. పెళ్లైన 45 రోజుల్లోనే ఓ మహిళ భర్తను హత్య చేయించేసింది. మామపై ప్రేమ పెంచుకున్న ఆమె, భర్తను అడ్డంకిగా భావించి సుపారీ గ్యాంగ్‌ను రెడీ చేసింది. పోలీసుల సమాచారం ప్రకారం — 20 ఏళ్ల గుంజాదేవికి, 25 ఏళ్ల ప్రియాంశుతో వివాహం జరిగింది. కానీ పెళ్లికి ముందు నుంచే ఆమె మామ జీవన్ సింగ్ (55)తో సంబంధం ఉంది. కుటుంబ సభ్యులు దీనిని వ్యతిరేకించడంతో ఆమెను బలవంతంగా ప్రియాంశుతో పెళ్లి చేశారు. జూన్ 25న ప్రియాంశు రైలు ప్రయాణం చేస్తూ ఇంటికి వస్తుండగా నవీనగర్ స్టేషన్ వద్ద దుండగులు అతడిపై కాల్పులు జరిపి హత్య చేశారు. దర్యాప్తులో గుంజాదేవి, జీవన్ సింగ్ మధ్య తరచూ కాల్స్, సుపారీ గ్యాంగ్‌తో కాంటాక్టులు ఉన్నట్లు వెల్లడి అయింది. ప్రస్తుతం గుంజాదేవి, ఇద్దరు గ్యాంగ్ సభ్యులు పోలీసుల అదుపులో ఉన్నారు. జీవన్ సింగ్ పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు కొనసాగుతోంది.