L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
‘ది రాజా సాబ్’ రిలీజ్ మళ్లీ పోస్ట్‌పోన్ కావొచ్చా?
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
‘ది రాజా సాబ్’ రిలీజ్ మళ్లీ పోస్ట్‌పోన్ కావొచ్చా?

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ విడుదల మరింత ఆలస్యం కావచ్చని టాక్. ఐటెం సాంగ్ మినహా షూటింగ్ పూర్తయినా, గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడం వల్ల డిసెంబర్ 5న విడుదల కష్టమవుతున్నట్లు సమాచారం. వీఎఫ్ఎక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో, క్వాలిటీ విషయంలో రాజీ పడదామని మేకర్స్ అంటున్నారు. ఆలస్యమైనా కంటెంట్ బాగా రావాలని భావిస్తున్నారు. డిసెంబర్‌కి విడుదల సాధ్యంకాకపోతే, సంక్రాంతి రిలీజ్‌ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే చిరంజీవి–అనిల్ రావిపూడి సినిమా, ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ మూవీ సంక్రాంతి బరిలో ఉండటంతో పోటీ తీవ్రమవుతుంది. ఈ పరిస్థితుల్లో ‘ది రాజా సాబ్’ విడుదలపై స్పష్టత ఇవ్వాలని ప్రభాస్ అభిమానులు కోరుతున్నారు.
ట్యాగ్‌లు
CinemaLatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi