R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

హైదరాబాద్‌లో మహిళా డాక్టర్ అదృశ్యం – తల్లిదండ్రులకు సందేశం

హైదరాబాద్‌లో మహిళా డాక్టర్ అదృశ్యం – తల్లిదండ్రులకు సందేశం

హైదరాబాద్‌లో మహిళా డాక్టర్ అదృశ్యం – తల్లిదండ్రులకు సందేశం

హైదరాబాద్‌ నగరంలో డాక్టర్‌ శీరిష అనే యువతి అదృశ్యమయ్యారు. దమ్మాయిగూడకు చెందిన ఆమె, అమీర్‌పేటలోని ఓ వెల్‌నెస్ సెంటర్‌లో పని చేస్తున్నారు. తన స్నేహితుడు ఆంథోనీకు బ్యాంకు లోన్ విషయంలో సహాయం చేసిన నేపథ్యంలో, శీరిషకు తల్లిదండ్రులతో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. జూలై 29న "విధులకు వెళ్తున్నా" అంటూ ఇంటి నుంచి వెళ్లిన శీరిష, అప్పటి నుంచి కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. “గొడవలు ఆపితేనే ఇంటికి వస్తాను” అని శీరిష మేసేజ్‌ పంపినట్లు సమాచారం.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitrending news