Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వైసీపీకి ఇంక 20 ఏళ్లు అధికార అవకాశం లేదు: ఎమ్మెల్సీ నాగబాబు
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వైసీపీకి ఇంక 20 ఏళ్లు అధికార అవకాశం లేదు: ఎమ్మెల్సీ నాగబాబు

సీతంపేటలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక మరో 20 సంవత్సరాల పాటు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం సమన్వయంతో సమర్థంగా పాలన కొనసాగిస్తోందని తెలిపారు. చిన్నపాటి లోపాలు ఉంటే వాటిని సమన్వయ కమిటీ తక్షణమే పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. తాను నెలలో ఐదు నుండి పది రోజులు ఉత్తరాంధ్రలో గడుపుతానని, అక్కడి జనసేన కార్యకర్తలతో నేరుగా కలుసుకుంటానని చెప్పారు. త్వరలో జనసేనలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం కానుందని, ఎక్కువ సంఖ్యలో ప్రజలను పార్టీలో చేర్చాల్సిన అవసరం ఉందని నాగబాబు పిలుపునిచ్చారు. నామినేటెడ్ పదవుల విషయమై దామాషా ప్రకారం జనసేనకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi