L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

అద్దె కట్నం వేధింపులతో యువతి ఆత్మహత్య

అద్దె కట్నం వేధింపులతో యువతి ఆత్మహత్య

అద్దె కట్నం వేధింపులతో యువతి ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌ బాగ్‌పత్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం వేధింపులు తాళలేక మనీషా అనే 28 ఏళ్ల వివాహిత విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె శరీరంపైనే సూసైడ్ నోట్ రాసి, తన భర్త కుందన్‌తో పాటు అతడి కుటుంబమే బాధ్యులని పేర్కొంది. వివాహ సమయంలో రూ.20 లక్షలు, బుల్లెట్ బైక్ ఇచ్చినా.. కారుతో పాటు మరింత డబ్బు కోరుతూ అత్తింటివారు వేధింపులు కొనసాగించారు. చిత్రహింసలు, కరెంట్ షాక్‌తో చంపే యత్నం వంటి ఆరోపణలు మనీషా సూసైడ్ నోట్‌తో పాటు సెల్ఫీ వీడియోలో వివరించింది. ఆమె మృతి కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి కుటుంబం ముందే విడాకుల కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news