
జనగాం
రోడ్డుపై వదిలేసిన నవజాత శిశువు.. పోలీసుల దర్యాప్తు
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపురం గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రహదారిపై ఓ వస్త్రంలో చుట్టి వదిలేసిన మగ శిశువును స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును రక్షించి, చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. శిశువును జనగామ ఎంసీహెచ్‌లో చేర్చి వైద్యం అందిస్తున్నారు. పసికందును ఎవరు వదిలి వెళ్లారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

జనగాం
జనగామ జిల్లాలో తల్లి, కుమార్తె హత్య
జనగామ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తుమ్మడపల్లి ఐ గ్రామంలో ఓ ఇంట్లో నిద్రిస్తున్న తల్లి (75) మరియు కుమార్తె (45)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా ఆస్తి వివాదమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.