మెదక్‌లో అగ్ని ప్రమాదం… మూడు దుకాణాలు దగ్ధం

మెదక్‌లో అగ్ని ప్రమాదం… మూడు దుకాణాలు దగ్ధం

మెదక్ పట్టణంలో అర్ధరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మూడు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని దుకాణదారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పూర్తిగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

దౌల్తాబాద్ బైపాస్‌ రోడ్డుపై చెత్తకుప్పలు.. ప్రజలు తీవ్ర అసంతృప్తి

దౌల్తాబాద్ బైపాస్‌ రోడ్డుపై చెత్తకుప్పలు.. ప్రజలు తీవ్ర అసంతృప్తి

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలంలోని బైపాస్ రోడ్డులో పారిశుధ్యం పూర్తిగా కనిపించకపోవడంతో దుర్వాసన తీవ్రంగా వ్యాపిస్తోంది. హరితహారంలో నాటిన మొక్కల మధ్య చెత్తాచెదారం పేరుకుని వాహనదారులు ముక్కు పట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. కాలేజీ, మార్కెట్‌ రోడ్డులకూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రజలు అధికారులను పలుమార్లు కోరినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

జిల్లాలో వర్షాల జోరు – పంటలకు ఉత్సాహం

జిల్లాలో వర్షాల జోరు – పంటలకు ఉత్సాహం

ఇటీవలి వర్షాలతో జిల్లాలో పంటల సాగు ఊపందుకుంది. మొత్తం 3.50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టగా, ఇప్పటివరకు 92% మేరకు సాగు పూర్తయింది. వరి, పత్తి ప్రధాన పంటలుగా సాగులో ముందంజలో ఉన్నాయి. చెక్‌డ్యామ్‌లు, ఆనకట్టలు నిండిపోవడంతో నీటి నిల్వలు పెరిగాయి. 21 మండలాల్లో 16 మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదై, రైతుల్లో కొత్త ఆశలు రేపుతోంది.