ప్రసన్నపై చర్యలు తీసుకోండి – ఎస్పీకి ప్రశాంతిరెడ్డి ఫిర్యాదు

ప్రసన్నపై చర్యలు తీసుకోండి – ఎస్పీకి ప్రశాంతిరెడ్డి ఫిర్యాదు

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వైకాపా నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఆమె ఏఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. మీడియాతో మాట్లాడిన ఆమె, ప్రసన్న కుమార్‌ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు.

నెల్లూరు జిల్లాలో గంగా-కావేరి ఎక్స్‌ప్రెస్‌లో చిన్న మంటలు ఆందోళనకు గురైన ప్రయాణికులు

నెల్లూరు జిల్లాలో గంగా-కావేరి ఎక్స్‌ప్రెస్‌లో చిన్న మంటలు ఆందోళనకు గురైన ప్రయాణికులు

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి గేటు సమీపంలో గంగా-కావేరి ఎక్స్‌ప్రెస్‌ (12670) రైల్లో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చాప్రా నుంచి చెన్నై వెళ్తున్న రైలు ఇంజిన్‌ వెనుక ఉన్న బోగీలో బ్రేక్ బైండింగ్ కారణంగా పొగలు కమ్మాయి. దీంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమై రైలును ఆపారు. ఈ క్రమంలో భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి దిగి దూరంగా వెళ్లిపోయారు. సిబ్బంది సమస్యను పరిష్కరించడంతో అరగంటలో రైలు తిరిగి ప్రయాణం కొనసాగించింది.