R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఎనీ టైం.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌!

ఎనీ టైం.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌!

ఎనీ టైం.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌!

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఇకపై ఏ సమయంలోనైనా జరగనున్నాయి. ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ జోయల్ డేవిస్‌ తాజా ఆదేశాలతో ఈ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పిల్లలను తరలించే బస్సులు, వ్యాన్లు, ఆటోల్లో డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్టు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత నెల రోజుల్లో స్కూల్ వాహనాలపై తనిఖీల్లో 35 మందిని డ్రంక్ డ్రైవ్‌లో పట్టుకున్నారు. ఓ డ్రైవర్‌కు 400 BAC రీడింగ్ రావడంతో నగరంలో ఎప్పుడైనా తనిఖీలు ప్రారంభించారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా తనిఖీలు జరగడంతో కొంతమంది వాహనదారులకు అసౌకర్యంగా మారింది. ఇకపై టెస్టుల్లో 30mg/dl కన్నా ఎక్కువగా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యాశాఖ, రవాణాశాఖలతో కలిసి స్కూల్ వాహనాలపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitrending newselectricitybill health