
క్రెడిట్ కార్డు లిమిట్ పెంపు పేరిట వృద్ధుడిని మోసగించిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్: షేక్‌పేటకు చెందిన 67 ఏళ్ల వృద్ధుడు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి సైబర్ మోసానికి గురయ్యాడు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అని చెప్పిన ఒకరు వీడియో కాల్ చేసి, లింక్ పంపించి స్క్రీన్ షేరింగ్ ఇవ్వాలని కోరాడు. కాల్‌లో ఉండగానే డిటైల్స్ ఎంటర్ చేయించగా, 2.5 లక్షల వరకు లిమిట్ పెరిగిందని చెప్పి కాల్ కట్ చేశారు. కొద్ది క్షణాల్లోనే వృద్ధుడి ఖాతా నుంచి రూ.2.03 లక్షలు డెబిట్ అయ్యాయి. మోసాన్ని గుర్తించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల | KRTV | KRANTHINEWS
హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఐసెట్-2025 ఫలితాలను అధికారులు ఈ రోజు విడుదల చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను ప్రకటించారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డు మరియు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ icet.tgche.ac.in ద్వారా పొందవచ్చు. ఫలితాలితో పాటు తుది ‘కీ’ను కూడా విడుదల చేశారు. ఐసెట్‌లో అర్హత సాధించిన వారికి త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల కానుంది. కౌన్సిలింగ్ ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి అనుబంధ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో ఎంబీఏ, ఎంసీఏ సీట్లు కేటాయించనున్నారు. ఈసారి ఐసెట్ పరీక్షను మహాత్మాగాంధీ యూనివర్సిటీ, నల్గొండ ఆధ్వర్యంలో జూన్ 8, 9 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించారు.

ఓయూ ఎంబీఏ, బీఈడీ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ, బీఈడీ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు పరీక్షల నియంత్రకుడు ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలు ఆగస్ట్ 5 నుంచి ప్రారంభమవనున్నాయి. అలాగే, బీఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, ఇతర సెమిస్టర్ల బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫీజు జూలై 24లోపు చెల్లించాలి. రూ.200 ఆలస్య రుసుముతో జూలై 29 వరకు చెల్లించవచ్చు. పూర్తి సమాచారం కోసం విద్యార్థులు ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in లో చూడవచ్చు.

హైదరాబాద్‌లో పాశవిక హత్య: తండ్రిని చంపిన తల్లీకూతుళ్లు
హైదరాబాద్‌లోని మౌలాలీలో ఓ అమానుష ఘటన వెలుగుచూసింది. అక్రమ సంబంధానికి అడ్డు అవుతున్నాడన్న కారణంతో తల్లీ, కూతురు కలిసి తండ్రిని హత్య చేశారు. వడ్లూరి లింగం అనే వ్యక్తి సెక్యూరిటీగా పనిచేస్తుండగా, ఆయన భార్య శారద జీహెచ్ఎంసీలో పని చేస్తోంది. వారి పెద్ద కూతురు మనీషా, భర్త స్నేహితుడు మహ్మద్ జావీద్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీనిపై తండ్రి అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. తల్లీకూతుళ్లు, ప్రియుడితో కలిసి లింగంను హత్య చేయాలని నిర్ణయించారు. జూలై 5న లింగం తాగే కల్లులో నిద్రమాత్రలు కలిపి, అతను నిద్రలోకి జారుకున్న తర్వాత మెత్త పెట్టి ఊపిరాడకుండా చేసి, తాడుతో ఉరివేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఓ క్యాబ్‌లో తీసుకెళ్లి ఎదులాబాద్ చెరువులో వేయించారు. జూలై 7న మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల సమాచారంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరా ఆధారంగా నిందితులను గుర్తించి, తల్లీకూతుళ్లు మరియు జావీద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో గందరగోళం కొనసాగుతూనే భక్తుల్లో ఆందోళన
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో రెండుేళ్లుగా పూర్తిస్థాయి ఈవో లేకుండా ఇంఛార్జ్ పాలన కొనసాగుతోంది. ఏడాదికి రూ.7 కోట్ల ఆదాయం ఉన్నా, పరిపాలనలో సమన్వయం లేక పండుగలు, సేవల నిర్వహణలో అవ్యవస్థలు తలెత్తుతున్నాయి. అధికారులు, సిబ్బందిలో విభేదాలు, నకిలీ టిక్కెట్లు, సంపులో భక్తుడి మృతి వంటి సంఘటనలు ఆలయ పరిపాలనపై ప్రశ్నలు రేపుతున్నాయి. శాశ్వత ఈవోను నియమించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

కోట శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ఫిల్మ్‌నగర్ నుంచి మహాప్రస్థానం వరకు జరిగాయి. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు హాజరై అశ్రునివాళులు అర్పించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట ఈ ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. ఆయన భౌతికదేహాన్ని చూసేందుకు పలువురు ప్రముఖులు వచ్చి ఘన నివాళులు అర్పించారు.

ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరలో స్వర్ణలత భవిష్యవాణి
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరలో రంగం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఇందులో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చేశారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని చెప్పారు. అయితే మహమ్మారి మళ్లీ వచ్చే అవకాశం ఉందని, అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని భక్తులను హెచ్చరించారు. పూజలు నిర్లక్ష్యంగా జరగడం వల్ల మరణాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. తాను రక్తబలిని కోరుకుంటానని, భక్తులు పూజలు పూర్తి స్థాయిలో నిర్వహించాలని కోరారు. కాలం తీరితే ప్రతిఒక్కరూ తమ ఫలితాన్ని అనుభవిస్తారని వెల్లడించారు.

హైదరాబాద్ రోడ్డుపై బైక్‌పై ప్రేమజంట అసభ్య ప్రవర్తన
హైదరాబాద్ నగరంలో రోడ్డు మీద ప్రయాణిస్తున్న బైక్‌పై ఓ ప్రేమజంట అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో మర్యాదలేర్చకుండా ప్రవర్తిస్తున్న ప్రేమజంటల ప్రవర్తనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో స్టేషన్లు, బస్టాండ్‌లు, రోడ్లపై ఇలాంటి ఘటనలు తరచుగా కనిపిస్తూ ఉండటం కలవరానికి దారి తీస్తోంది. ఇటువంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

కూరగాయల ధరలు గగనానికి
హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాభావం కారణంగా కూరగాయల సాగు తగ్గిపోయింది. దీంతో మార్కెట్లలో ధరలు భారీగా పెరిగాయి. బీన్స్ రూ.90, క్యాప్సికం రూ.80, చిక్కుడు రూ.75, పచ్చిమిర్చి రూ.60కి చేరాయి. సాగు తగ్గడంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి దిగుమతులు జరుగుతున్నాయి. జూన్‌లో రూ.55 ఉన్న బీన్స్ ధర జూలైలో రూ.90కి చేరింది. అలాగే క్యాప్సికం, పచ్చిమిర్చి, బజ్జీమిర్చి, బెండకాయ ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. శ్రావణ మాసం వల్ల వచ్చే రోజులలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హెచ్‌సీఏ లో అవకతవకలపై సీఐడీ దర్యాప్తు ఉత్కంఠతరం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) లో జరిగిన అక్రమాలపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. మల్కాజిగిరి కోర్టు ఆదేశాల మేరకు ఐదుగురు నిందితులను ఆరు రోజుల పాటు సీఐడీ కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతి లభించింది. ఈ కేసులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్, రాజేందర్ యాదవ్, కవితలకు సీఐడీ ప్రశ్నలు వేస్తుంది. వీరిలో నలుగురు నిందితులను చర్లపల్లి జైలులో నుంచి, కవితను చంచల్‌గూడ జైలులో నుంచి అధికారులు తీసుకెళ్లనున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు సీఐడీ కస్టడీలో విచారణ సాగనుంది. దర్యాప్తులో భాగంగా హెచ్‌సీఏలో జరిగిన పలు ఆర్థిక, పరిపాలనా విషయాలకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఓయూలో వచ్చే నెల 84వ స్నాతకోత్సవం
ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవాన్ని వచ్చే నెల మూడో వారంలో నిర్వహించనుంది. 2022–23, 2023–24 విద్యాసంవత్సరాల్లో డిప్లొమా, యూజీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు పట్టాలు, బంగారు పతకాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆగస్టు 7వ తేదీ వరకు www.osmania.ac.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్యం అయితే రూ.500 అపరాధ రుసుముతో ఆగస్టు 12వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. యూజీ బంగారు పతకాలను అనంతరంగా సంబంధిత కళాశాలల నుంచే అందజేస్తారు.

హైదరాబాద్‌లో వర్ష బీభత్సం – తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు!
హైదరాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి కుండపోత వర్షం కురిసింది. మియాపూర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట, బంజారాహిల్స్, పంజాగుట్ట ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రధాన రహదారుల్లో నీటి నిల్వలు ఏర్పడ్డాయి. వర్ష ప్రభావం నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం శనివారం కూడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు యల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
76 లో 1-12 చూపిస్తోంది