Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

హైదరాబాద్‌లో పాశవిక హత్య: తండ్రిని చంపిన తల్లీకూతుళ్లు

హైదరాబాద్‌లో పాశవిక హత్య: తండ్రిని చంపిన తల్లీకూతుళ్లు

హైదరాబాద్‌లో పాశవిక హత్య: తండ్రిని చంపిన తల్లీకూతుళ్లు

హైదరాబాద్‌లోని మౌలాలీలో ఓ అమానుష ఘటన వెలుగుచూసింది. అక్రమ సంబంధానికి అడ్డు అవుతున్నాడన్న కారణంతో తల్లీ, కూతురు కలిసి తండ్రిని హత్య చేశారు. వడ్లూరి లింగం అనే వ్యక్తి సెక్యూరిటీగా పనిచేస్తుండగా, ఆయన భార్య శారద జీహెచ్ఎంసీలో పని చేస్తోంది. వారి పెద్ద కూతురు మనీషా, భర్త స్నేహితుడు మహ్మద్ జావీద్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీనిపై తండ్రి అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. తల్లీకూతుళ్లు, ప్రియుడితో కలిసి లింగంను హత్య చేయాలని నిర్ణయించారు. జూలై 5న లింగం తాగే కల్లులో నిద్రమాత్రలు కలిపి, అతను నిద్రలోకి జారుకున్న తర్వాత మెత్త పెట్టి ఊపిరాడకుండా చేసి, తాడుతో ఉరివేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఓ క్యాబ్‌లో తీసుకెళ్లి ఎదులాబాద్ చెరువులో వేయించారు. జూలై 7న మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల సమాచారంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరా ఆధారంగా నిందితులను గుర్తించి, తల్లీకూతుళ్లు మరియు జావీద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnanacrime news