Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

హెచ్‌సీఏ లో అవకతవకలపై సీఐడీ దర్యాప్తు ఉత్కంఠతరం

హెచ్‌సీఏ లో అవకతవకలపై సీఐడీ దర్యాప్తు ఉత్కంఠతరం

హెచ్‌సీఏ లో అవకతవకలపై సీఐడీ దర్యాప్తు ఉత్కంఠతరం

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ (హెచ్‌సీఏ) లో జరిగిన అక్రమాలపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. మల్కాజిగిరి కోర్టు ఆదేశాల మేరకు ఐదుగురు నిందితులను ఆరు రోజుల పాటు సీఐడీ కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతి లభించింది. ఈ కేసులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్, రాజేందర్ యాదవ్, కవితలకు సీఐడీ ప్రశ్నలు వేస్తుంది. వీరిలో నలుగురు నిందితులను చర్లపల్లి జైలులో నుంచి, కవితను చంచల్‌గూడ జైలులో నుంచి అధికారులు తీసుకెళ్లనున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు సీఐడీ కస్టడీలో విచారణ సాగనుంది. దర్యాప్తులో భాగంగా హెచ్‌సీఏలో జరిగిన పలు ఆర్థిక, పరిపాలనా విషయాలకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnanahyderabad