R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

హైదరాబాద్ గణేష్ ఉత్సవాలపై కమీషనర్ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు..

హైదరాబాద్ గణేష్ ఉత్సవాలపై కమీషనర్ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు..

హైదరాబాద్ గణేష్ ఉత్సవాలపై కమీషనర్ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు..

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, గణేష్ పండగ ఎక్కువ రోజులు జరగడంతో ముందస్తు ఏర్పాట్లు కఠినంగా చేపట్టామని తెలిపారు. విగ్రహాల సంఖ్య, నిమజ్జన మార్గాలు, విద్యుత్ వైర్లపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి మండపం వద్ద పోలీసు బందోబస్తు, అగ్ని ప్రమాదాల నివారణకు వాలంటీర్లు, క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సౌండ్ పొల్యూషన్ నియంత్రణ, జియో ట్యాగ్ ద్వారా మానిటరింగ్, దొంగతనాలు–హారాజ్మెంట్‌లను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి పెట్టనున్నామని అన్నారు.

ట్యాగ్‌లు

TrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi