ritesh
రచయిత
ఐఏఎస్ అని చెప్పుకుంటూ ఓయూలో దొరికిన నకిలీ అధికారి
ritesh
రచయిత
ఐఏఎస్ అని చెప్పుకుంటూ ఓయూలో దొరికిన నకిలీ అధికారి

ఐఏఎస్ అధికారిని అని చెప్పుకుంటూ తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఆగస్టు 31న ఓయూ ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ దగ్గర జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాలు ఇలా ఉన్నాయి: కాలేజీ ముందు బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న నలుగురిని సెక్యూరిటీ అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగి, దాడికి దారి తీసింది. ఈ సమయంలో ఒకరు తాను ఐఏఎస్ అధికారి అని చెప్పుకున్నారు.ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బోడా దేవిలాల్, జనార్ధన్, తులసీరామ్, ధన్ సింగ్ బోడాగా గుర్తించారు. దేవిలాల్ వాస్తవానికి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (IES) కు చెందినవాడని, తప్పుడు రీతిలో ఐఏఎస్ అని చెప్పుకున్నట్లు తేలింది.ఈ నలుగురు గతంలో కూడా OUలో మద్యం సేవించి భద్రతా సిబ్బందితో గొడవలకు పాల్పడినట్లు తెలిసింది.

