L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తొమ్మిదో రోజు నుంచే గణేశ్ నిమజ్జనాల రద్దీ
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తొమ్మిదో రోజు నుంచే గణేశ్ నిమజ్జనాల రద్దీ

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం దగ్గర పడుతున్న వేళ, ఈసారి 9వ రోజునే ఎక్కువ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. కారణం – 11వ రోజు పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఉండటంతో, ఆలస్యం కాకుండా ముందుగానే నిమజ్జనాలు పూర్తి చేసుకోవాలని అనేక మండప నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అయితే భారీ విగ్రహాలను తరలించే రహదారులపై గుంతలు, చెట్ల కొమ్మలు, వేలాడుతున్న విద్యుత్ తీగలు ఇంకా సరిచేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 3, 5, 7, 9వ రోజుల్లో ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం చేస్తే, 11వ రోజు భద్రంగా పూర్తిచేయవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. అధికారులు మాత్రం ట్యాంకుల వద్ద ఏర్పాట్లు త్వరగా పూర్తి చేసి, ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటామని చెబుతున్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihyderabad

