R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హైదరాబాద్‌కు హైడ్రా అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హైదరాబాద్‌కు హైడ్రా అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ నగర అభివృద్ధిలో హైడ్రా కీలకపాత్ర పోషిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రేటర్ పరిధిలో చెరువులు, నాలాలపై ఉన్న అక్రమాలు హైడ్రా ఆపుతుందన్నారు. ఇప్పటివరకు 13 పార్కులు, 20 చెరువులను కబ్జాల నుంచి రికవర్ చేశారన్నారు.వర్షాల సమయంలో ట్రాఫిక్, వరద నీటి సమస్యలను గంటల్లోనే పరిష్కరిస్తోందని హైడ్రాను పొగడ్తలతో ముంచెత్తారు. హైడ్రా అవసరాన్ని హైదరాబాద్ ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు.పేదల్లో భయాలు రేకెత్తించేందుకు కొంతమంది హైడ్రాను బూచిగా చూపిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.ఆగస్ట్ 15న గోల్కొండ కోటలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihyderabad