ritesh
రచయిత
జీహెచ్ఎంసీ హైడ్రా మధ్య మౌన యుద్ధమా?
ritesh
రచయిత
జీహెచ్ఎంసీ హైడ్రా మధ్య మౌన యుద్ధమా?

ఈసారి మాన్సూన్ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్‌ను జీహెచ్ఎంసీ వద్ద నుంచి హైడ్రాకు బదలాయించిన రాష్ట్ర ప్రభుత్వం, కీలక బాధ్యతలను హైడ్రాకు అప్పగించింది. జూన్ 9న విడుదలైన మెమో ప్రకారం, వర్షాల సమయంలో చెత్త తొలగింపు, ట్రాఫిక్ మార్గాలు మార్చడం, నాలాల భద్రత తనిఖీలు, పూడిక తీత వంటి చర్యలు హైడ్రా చేపట్టాల్సి ఉంది. అయితే, ఈ పనుల్లో సంబంధిత శాఖలతో సమన్వయం జరగాల్సినప్పటికీ, అవి కష్టంగా మారాయి. హైడ్రా బృందాలు జలమండలి, విద్యుత్ శాఖ, జీహెచ్ఎంసీ ఇంజినీర్లతో కలిసి పనిచేయాల్సి ఉంది. కానీ ఈశాఖల మధ్య సహకారం లేకపోవడంపై ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ లాగింగ్ ఏ ప్రాంతాల్లో ఉంది, వాటి వివరాలు ఇప్పటికే పలు మార్లు హైడ్రాకు అందించాం," అంటున్నారు అధికారులు. అయినప్పటికీ స్పందన లేదు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో, హైడ్రా-జీహెచ్ఎంసీ మధ్య మౌన యుద్ధం మొదలైనట్టే కనిపిస్తోంది. చివరికి నష్టపోయేది మాత్రం హైదరాబాదీయులే అని నిపుణులు అంటున్నారు.