R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
యూరియా కొరతపై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన కేటీఆర్
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
యూరియా కొరతపై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన కేటీఆర్

రైతుల సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఎల్లారెడ్డిపేట రైతు లక్ష్మణ్ యాదవ్ తన గోస చెప్పినందుకు అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. యూరియా కొరత వల్ల పంటలు ఎండిపోతున్నా రైతుల కష్టాలు పట్టించుకోకుండా వారిని వేధించడం దుర్మార్గమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు అని, రైతులపై కేసులు పెట్టడం సరికాదని స్పష్టం చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ కవచంలా నిలుస్తుందని, అన్నదాతలపై అన్యాయం జరిగితే ఎదురులేదని కేటీఆర్ హెచ్చరించారు. “జై కిసాన్ – జై తెలంగాణ” అంటూ నినదించారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

