K

krtv

రచయిత

1 నిమిషాలు చదవడానికి

నల్లగొండ: నాగార్జున సాగర్‌లో కృష్ణా నది ఉధృత ప్రవాహం – 26 గేట్ల ద్వారా నీటిని విడుదల

నల్లగొండ: నాగార్జున సాగర్‌లో కృష్ణా నది ఉధృత ప్రవాహం – 26 గేట్ల ద్వారా నీటిని విడుదల

నల్లగొండ: నాగార్జున సాగర్‌లో కృష్ణా నది ఉధృత ప్రవాహం – 26 గేట్ల ద్వారా నీటిని విడుదల

నల్లగొండ: ఎగువ కృష్ణా నుండి నాగార్జున సాగర్ వైపున ప్రవహిస్తున్న కృష్ణమ్మ ఉరకలు సాగర్‌ను నిండు కుండలా మార్చాయి. భారీ వరద ప్రవాహం కారణంగా 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 24 గేట్లను 5 అడుగులు, 2 గేట్లను 10 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2,61,972 క్యూసెక్కులుగా ఉన్నాయని, సాగర్ స్పిల్‌వే ద్వారా 2,16,842 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 8,529 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత స్థాయి 587.40 అడుగులు ఉంది. జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ 305.74 టీఎంసీలుగా ఉంది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi