ritesh
రచయిత
కడపలో ప్రోటోకాల్ వివాదం – ఎమ్మెల్యే మాధవి రెడ్డి అసహనం
ritesh
రచయిత
కడపలో ప్రోటోకాల్ వివాదం – ఎమ్మెల్యే మాధవి రెడ్డి అసహనం

కడప జిల్లాలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ సంబంధిత వివాదం చెలరేగింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.వేదికపైకి తనను ఆహ్వానించకపోవడంపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ జేసీని ఉరిమి చూసినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్వయంగా ఆమెను స్టేజ్‌పైకి రావాలని కోరినప్పటికీ, ఎమ్మెల్యే తిరస్కరించారు.దాదాపు అరగంట పాటు కార్యక్రమ ప్రాంగణంలో నిల్చుని నిరసన తెలుపిన ఆమె చివరికి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో మంత్రి ఫరూక్, ఎస్పీ అశోక్ కుమార్, జేసీ సహా పలువురు అధికారులు వేదికపై ఉన్నారు.ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకు కుర్చీ వేయకపోవడమే అసలు కారణమని సమాచారం. ఈ విషయంపై స్థానిక వైసీపీ శ్రేణులు స్పందిస్తూ, పార్టీకి చెడుపేర్చే చర్యలంటూ ఆమె తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.