ఇడుపులపాయలో వైఎస్సార్‌కు జగన్ నివాళి

ఇడుపులపాయలో వైఎస్సార్‌కు జగన్ నివాళి

మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయలోని ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విజయమ్మ, భారతి, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు. "మిస్ యూ నాన్న" అంటూ జగన్ ట్వీట్ చేశారు

కడప జైలులో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్

కడప జైలులో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్

కడప కేంద్ర కారాగారంలో అనుచిత కార్యకలాపాల ఆరోపణలపై ఐదుగురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేశారు. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్‌తో పాటు ముగ్గురు వార్డర్లపై చర్యలు తీసుకున్నారు. ఖైదీలకు మొబైల్ ఫోన్లు అందజేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై డీఐజీ రవికిరణ్ నాలుగు రోజులపాటు విచారణ జరిపారు. అందులో వెల్లడైన వివరాలపై జైళ్ల శాఖ డీజీ ఆధారంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

కడపలో ప్రోటోకాల్ వివాదం – ఎమ్మెల్యే మాధవి రెడ్డి అసహనం

కడపలో ప్రోటోకాల్ వివాదం – ఎమ్మెల్యే మాధవి రెడ్డి అసహనం

కడప జిల్లాలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ సంబంధిత వివాదం చెలరేగింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.వేదికపైకి తనను ఆహ్వానించకపోవడంపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ జేసీని ఉరిమి చూసినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్వయంగా ఆమెను స్టేజ్‌పైకి రావాలని కోరినప్పటికీ, ఎమ్మెల్యే తిరస్కరించారు.దాదాపు అరగంట పాటు కార్యక్రమ ప్రాంగణంలో నిల్చుని నిరసన తెలుపిన ఆమె చివరికి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో మంత్రి ఫరూక్, ఎస్పీ అశోక్ కుమార్, జేసీ సహా పలువురు అధికారులు వేదికపై ఉన్నారు.ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకు కుర్చీ వేయకపోవడమే అసలు కారణమని సమాచారం. ఈ విషయంపై స్థానిక వైసీపీ శ్రేణులు స్పందిస్తూ, పార్టీకి చెడుపేర్చే చర్యలంటూ ఆమె తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.