Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

🌧️ హైదరాబాద్‌లో మళ్లీ వర్షం.. రహదారులపై వరదనీరు

🌧️ హైదరాబాద్‌లో మళ్లీ వర్షం.. రహదారులపై వరదనీరు

🌧️ హైదరాబాద్‌లో మళ్లీ వర్షం.. రహదారులపై వరదనీరు

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, అమీర్‌పేట, బంజారాహిల్స్, నాంపల్లి, ఎల్బీనగర్‌ సహా చాలా ప్రాంతాల్లో వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. నిమ్స్‌ వద్ద, పలుచోట్ల వాహనదారులు భారీ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నారు. సికింద్రాబాద్‌ పరిధిలోని ప్యాట్నీ నాలా ఉప్పొంగి పైగా కాలనీలోకి వరదనీరు ప్రవహిస్తోంది. కంటోన్మెంట్‌ అధికారులు ఇసుక బస్తాలతో తాత్కాలిక చర్యలు తీసుకున్నా వరద ఆగకపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సహాయక బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnana