ritesh
రచయిత
హైదరాబాద్‌లో వర్ష బీభత్సం – జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు
ritesh
రచయిత
హైదరాబాద్‌లో వర్ష బీభత్సం – జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు

హైదరాబాద్ నగరాన్ని సోమవారం కురిసిన భారీ వర్షం అతలాకుతలం చేసింది. నగరంలోని బంజారాహిల్స్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, తార్నాక, నాంపల్లి, మలక్‌పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వరదనీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.బంజారాహిల్స్ రోడ్ నం.12 నుంచి విరంచి ఆస్పత్రి వరకు ట్రాఫిక్ జామ్ నెలకొంది. వర్షంతో పాటు వీచిన ఈదురు గాలులు ప్రజలను ఇబ్బందిలోకి నెట్టాయి. వర్ష పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలకు అవసరం లేనిపక్షంలో ఇంట్లోనే ఉండాలని సూచించారు.హైదరాబాద్ వాతావరణ కేంద్రం నగరానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరో రెండు గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో హెచ్చరికలతో పాటు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.