R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రాచకొండలో గణేశ్ నవరాత్రుల ఏర్పాట్లు సమీక్ష

రాచకొండలో గణేశ్ నవరాత్రుల ఏర్పాట్లు సమీక్ష

రాచకొండలో  గణేశ్ నవరాత్రుల ఏర్పాట్లు సమీక్ష

రాచకొండ కమిషనరేట్‌లో గణేశ్‌ నవరాత్రులు, నిమజ్జన ఏర్పాట్లపై సీపీ సుధీర్‌బాబు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న గణేశ్‌ చవితి, సెప్టెంబర్‌ 5న మిలాద్‌ ఉన్‌ నబీ, 6న గణేశ్‌ నిమజ్జనం ఉండటంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు కలిసి పనిచేయాలని సూచించారు. మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని, విద్యుత్‌ ఏర్పాట్లు నిపుణులచేత చేయించుకోవాలని, క్యూ లైన్లు–పార్కింగ్‌ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. విగ్రహ నిమజ్జనాన్ని చివరి రోజు కాకుండా 3, 5, 7వ రోజులలో కూడా నిర్వహించాలని తెలిపారు. డ్రోన్లు, ఫ్లైయింగ్‌ కెమెరాలకు నిషేధం విధించగా, బలవంతపు చందాలు వసూలు చేయరాదని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihyderabad