krtv
రచయిత
రాష్ట్రంలో ఇసుక ధరలు పెరిగి నిర్మాణరంగం కష్టాల్లో
krtv
రచయిత
రాష్ట్రంలో ఇసుక ధరలు పెరిగి నిర్మాణరంగం కష్టాల్లో

రాష్ట్రంలో ఇసుక ధరలు భారీగా పెరిగి నిర్మాణ రంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గతంలో బీఆర్‌ఎస్ పాలనలో టన్ను ఇసుక ధర సగటున రూ.1,400 ఉండగా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో టన్ను రూ.2,000 పైగా ఉంది. హైదరాబాద్‌లో అయితే ధర రూ.2,400 చేరింది. వర్షాలు, అధికారుల నిర్లక్ష్యం వల్ల రీచ్‌లలో ఇసుక లోడింగ్ ఆలస్యమవుతోంది. పైగా ఇసుక బజార్లలో లభిస్తున్న ఇసుక మట్టితో కలిసివుండటంతో బిల్డర్లు కొనడాన్ని ఇష్టపడటం లేదు. దీంతో బహిరంగ మార్కెట్‌లో ధరలు పెరిగాయి. నిర్మాణదారులు రోబో శాండ్‌పై ఆధారపడాల్సి వస్తోందని, 150 గజాల ఇల్లు నిర్మించడానికి అదనంగా లక్ష రూపాయల వరకూ ఖర్చవుతోందని అంటున్నారు. గతంలో టన్ను రూ.1,500 లోపు దొరికినట్టు మళ్లీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. టీజీఎండీసీ ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయింది. 2018-19లో 222 లక్షల టన్నుల ఇసుక విక్రయం ద్వారా రూ.886 కోట్లు వచ్చినా, ఇప్పుడు ఏటా రూ.700 కోట్లు కూడా రాకుండా పరిస్థితి దారుణంగా మారింది.

