R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 40 కోట్ల గంజాయి పట్టివేత
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 40 కోట్ల గంజాయి పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు బుధవారం రాత్రి భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి దుబాయ్ ద్వారా హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి వద్ద 40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని గుర్తించారు. దీని విలువ సుమారు రూ. 40 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. పూర్తి సమాచారంతో ముందుగా ఏర్పాట్లుచేసిన అధికారులు విమానం ల్యాండ్ అయ్యే సరికి ఆమెను అదుపులోకి తీసుకుని లగేజీ తనిఖీ చేశారు. విచారణలో ఈ మహిళ గత కొంతకాలంగా గంజాయి రవాణాకు సంబంధించి శ్రేణిగా పని చేస్తోందని తేలింది. థాయిలాండ్‌లో గంజాయి సాగుపై నిషేధం తొలగిన తర్వాత అంతర్జాతీయ స్మగ్లింగ్ సిండికెట్లు భారత్ వైపు దృష్టి పెడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi