L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక సంక్షోభం తీవ్రం : కేటీఆర్

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక సంక్షోభం తీవ్రం : కేటీఆర్

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక సంక్షోభం తీవ్రం : కేటీఆర్

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందని బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ విమర్శించారు. కాగ్ తాజా త్రైమాసిక నివేదికను ప్రస్తావిస్తూ, రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయి, అప్పులు పెరుగుతున్నాయన్నారు. బడ్జెట్‌లో రూ. 2,738 కోట్ల మిగులు చూపించగా, తొలి త్రైమాసికానికే రూ. 10,583 కోట్ల లోటు, మూడు నెలల్లో రూ. 20,266 కోట్ల అప్పు తీసుకున్నారని తెలిపారు. పన్నేతర ఆదాయం కేవలం 3.37 శాతం మాత్రమే వసూలైందన్నారు. ఒక్క సంక్షేమ పథకం అమలు చేయక, ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రణాళిక ఏంటో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi