S
sairam
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
S
sairam
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

దిలాబాద్ జిల్లాలో దురదృష్టకరమైన సంఘటన చోటుచేసుకుంది. సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి అక్క తమ్ముడు ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మావల గ్రామానికి చెందిన వినూత్న (11), తమ్ముడు విదాత్ (8) గ్రీన్ వ్యాలీ కాలనీలో సైకిల్‌పై వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆకస్మికంగా నీటి గుంటలో పడిపోయిన వారిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. చిన్నారుల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
ట్యాగ్‌లు
LatestKranthi Newskrtv kranthitelagnana